కౌంటింగ్ కు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా

ఢిల్లీ కౌంటింగ్ కు ఒకరోజు ముందు ఒకరోజు హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు వచ్చారు.

Update: 2025-02-07 11:59 GMT

ఢిల్లీ కౌంటింగ్ కు ఒకరోజు ముందు ఒకరోజు హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు వచ్చారు. అయితే వారిని కేజ్రీవాల్ ఇంట్లోకి ఏసీబీ అధికారులను ఆప్ కార్యకర్తలు అనుమతించలేదు. ఏసీబీ అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ వారిని అనుమతించలేదు. అయితే ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ సిబ్బందికి నోటీసులు ఇచ్చివెళ్లిపోయారు.

కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ...
ఏసీబీ అధికారులు కే్జ్రీవాల్ ఇంటికి రావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చాలా సేపు ఎదురు చూసిన అధికారులు అనుమతించకపోవడంతో నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. ఆపరేషన్ లోటస్ అంటూ ఆరోపణలపై విచారణ చేయడానికి ఏసీబీ అధికారులు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపణలపై ఏసీబీ అధికారుల సోదాలు చేయడానికి కేజ్రీవాల్ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. కేజ్రీవాల్ ఆరోపణలపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు.


Tags:    

Similar News