సౌరభ్‌ గంగూలీ అన్న, వదినలకు తప్పిన పెను ప్రమాదం!

Update: 2025-05-27 10:30 GMT

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ అన్నయ్య స్నేహాశిష్‌ గంగూలీ, ఆయన భార్య అర్పిత ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒడిశాలోని పూరీ వచ్చిన వీరు స్పీడ్‌బోట్‌లో ప్రయాణిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది.

 ప్రమాదం జరిగింది..

10 మంది ప్రయాణికులు ఎక్కాల్సిన బోట్‌లో నలుగురు మాత్రమే వెళ్లడంతో కెరటాల ఉద్ధృతికి అది బోల్తాపడింది. అయితే తీరం వద్దనున్న ఇద్దరు లైఫ్‌గార్డులు వచ్చి స్నేహాశిష్‌ దంపతులను కాపాడారు. స్పీడ్‌బోట్‌ నిర్వాహకులు డబ్బుల కోసం పర్యాటకులను ప్రమాదం అంచులకు తీసుకెళ్లారని అర్పిత ఆరోపించారు.

Tags:    

Similar News