6000 కిలోమీటర్లు 18 రోజుల్లో!!

Update: 2025-05-22 09:55 GMT

అమూర్ ఫాల్కన్ పక్షి ఒడిశా నుండి చైనాలోని మంచూరియన్ బే వరకు కేవలం 18 రోజుల్లోనే 6,000 కిలోమీటర్ల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసిందని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ‘చియులువాన్ 2’ అని పిలువబడే మగ ఫాల్కన్ పక్షి పలు దేశాల మీదుగా ప్రయాణం చేసి మే 20న మంచూరియన్ బేకు చేరుకుందని డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.

2024 నవంబరు 8న మణిపుర్‌లోని టామెంగ్‌లాంగ్‌ జిల్లాలో ట్యాగ్ చేసిన పక్షిని విడిచిపెట్టారు. అక్కడి నుంచి వేల కిలో మీటర్లు ప్రయాణించి దక్షిణాఫ్రికా చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఒడిశాలోని కలహండి జిల్లాకు వచ్చేసింది. కార్లాపట్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో గడిపి, మే 2న ఢెంకనాల్‌ అడవులకు చేరింది. మళ్లీ తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టి బంగ్లాదేశ్‌లోని సుందర్బన్స్‌ మడ అడవులు, మయన్మార్‌ మీదుగా చైనాకు చేరింది.

Tags:    

Similar News