కుల్గామ్‌లో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లు వీరమరణం
గత తొమ్మిది రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు సైనిక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
గత తొమ్మిది రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు సైనిక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సమాచారం ప్రకారం కుల్గామ్‌లో రాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. కాగా పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సైన్యంపై ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న అర్థరాత్రి ఉగ్రదాడి జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
నిన్న అర్థరాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే గాయపడిన నలుగురు ఆర్మీ సిబ్బందిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.కుల్గామ్‌లోని ఆపరేషన్ అఖల్ గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేసింది.