కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారు - కేటీఆర్‌

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోమళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అభివృద్ది ..

Update: 2023-10-02 15:07 GMT

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోమళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అభివృద్ది చేసిన పనులే మళ్లీ జనాలు కేసీఆర్‌నే సీఎం చేస్తారని అన్నారు. సోమవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం సూర్యపేటలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరిపోయే దీపం కాంగ్రెస్.. దింపుడు గల్లం ఆశతో ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజాక్షేత్రంలో నేరుగా యుద్ధం చేయలేని ప్రతిపక్షాలు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేవని అన్నారు. కాంగ్రెస్‌ మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసులో దొరికి.. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తున్నా.. రావడం లేదని ఆరోపణలు చేస్తున్నారని, అనుమానం ఉన్నవారికి బస్సులలో తిరిగి చూపిస్తానని అన్నారు. సూర్యపేటలో జగదీష్‌కి డిపాజిట్ రాదన్న కోమటిరెడ్డికి తేల్చుకుందాం రా అని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఎవ్వరు ఊహించని విధంగా సూర్యాపేటను అభివృద్ధి చేసిన మంత్రి జగదీష్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్లతో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి పక్షాలు బీఆర్‌ఎస్‌ను విమర్శించే పనిగా పెట్టుకున్నాయని, వారికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నాశనం కావడం ఖాయమన్నారు. ఏదీ ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.



Tags:    

Similar News