పాఠశాలకు వెళుతూ ప్రమాదం.. ఒకరి మృతి
ఉదయం కారులో బయలుదేరిన ఉపాధ్యాయులు ప్రమాదానికి గురయ్యారు.
సంక్రాంతి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభం అవ్వడంతో ఉదయం కారులో బయలుదేరిన ఉపాధ్యాయులు ప్రమాదానికి గురయ్యారు.విధుల్లో చేరేందుకు నల్లగొండ నుంచి తుంగతుర్తికి ఐదుగురు ఉపాధ్యాయులు కారులో బయలుదేరి వెళుతుండగా టైరు పేలడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.
నల్లగొండ నుంచి తుంగతుర్తికి వెళుతూ...
నల్లగొండలో నివాసముంటూ తుంగతుర్తిలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ రోజూ కారు పూలింగ్ ద్వారా వెళ్లి వస్తుంటారు. ఈరోజు ఉదయం బయలుదేరిన కాసేపటికి సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్దకు చేరుకున్న వెంటనే టైర్ పంక్చర్ అయింది. దీంతో వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. దీంతో తుంగతుర్తి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అక్కడిక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ముగ్గురు ఉపాధ్యాయులకు గాయాలు కావడంతో ఆసుపత్రిలకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.