Telangana : నేడు మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మిర్యాలగూడలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మిర్యాలగూడలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. వరసగా జిల్లాల పర్యటనలు చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విస్తృత ప్రచారం చేయనున్నారు.
నేటి నుంచి...
జిల్లాల పర్యటనలో భాగంగా నేడు మిర్యాలగూడలో జరిగే సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలకు వివరించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగనున్నాయి.