Revanth Reddy : నేడు నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-12-06 03:13 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి దేవరకొండలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తుండటంతో ప్రజా పాలన విజయోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలను రోజూ చేస్తున్నారు.

దేవరకొండలో జరిగే...
ఈరోజు దేవరకొండకు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు భారీగా పార్టీ నేతలు జనసమీకరణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News