Telangana : నేడు సూర్యాపేట జిల్లాకు గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2026-01-23 04:00 GMT

తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు గవర్నర్ శంకుస్థాపనలు చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కు చేరుకోనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్కడి ప్రభుత్వ వ్యవసాయ విద్యాలయం తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేయనున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో...
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్థానిక నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ పర్యటనలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. దీంతో పాటు గవర్నర్ పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News