Telangana : అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పది మందికి గాయాలు
నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది
Nalgonda
నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అగ్నిగుండంలో భక్తులు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరుగుతన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గత కొన్నేళ్ల నుంచి అగ్ని గుండంలో నుంచి నడవటం సంప్రదాయంగా వస్తుంది.
తోపులాట జరగడంతో...
స్వామి వారి కల్యాణోత్సవం అనంతరం అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే భక్తుల మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారి నిప్పులగుండంలో పడిపోయారు. దాదాపు పది మంది భక్తులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లోకి చేరారు.