నేటి నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
నల్గొండ జిల్లాలో నేటి నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
నల్గొండ జిల్లాలో నేటి నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పార్వతీ జడల రామలింగేశస్వామి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలిరానున్నారు . ఈ చెరువుగట్టు ఉత్సవాలకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా హాజరు కానున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
లక్షలాది మంది భక్తులు...
లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడనున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ లను ఏర్పాటు చేశారు. చెరువుగట్టు ఉత్సవాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులతో పాటు పోలీసులు కూడా చేశారు.