Ragging : నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. గత నెల 31వ తేదీన సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈనెల 4వ తేదీన ర్యాగింగ్ విషయాన్ని విద్యార్థులు ప్రిన్సిపల్ కు, హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు.
గత ఏడాది కూడా...
ఒక రోజంతా జూనియర్లు ర్యాగింగ్ కు పాల్పడటం, ప్రిన్సిపల్ స్పందించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పినా ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ స్పందించకపోవడాన్ని విద్యార్థులు నిరసిస్తున్నారు. గత ఏడాది కూడా నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగింది. మరోసారి ర్యాగింగ్ జరగడం కలకలం రేపుతుంది. దీనిపై విచారణ కొనసాగుతుంది.