నల్గొండ జిల్లాలో చిరుత పులి కలకలం
నల్గొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపుతుంది
నల్గొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపుతుంది. మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఊరి శివారులోని ఓ పత్తి చేను వద్ద చిరుత సంచారం ఉండటాన్ని గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పత్తి కోసే క్రమంలో కూలీల చిరుత కంట పడటంతో ప్రజలు పొలాల్లోకి వెళ్లేందుకు భయపడిపోతున్నార.
మొబైల్ లో చిత్రీకరించి...
చిరుత పరుగులను మొబైల్ లో ఓ కూలీ బంధించాడు. చిరుత సంచారంతో గ్రామంలో భయం భయంగా గడుపుతున్నారు. అయితే చిరుత సంచారాన్ని అటవీ శాఖ అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. కానీ స్థానికులు అక్కడ చిరుత ఉందని చెప్పడంతో ఎవరూ ఒంటరిగా సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరించార