Road Accident : నల్గొండ జిల్లాలో లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లాలో లో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2026-03-10 04:30 GMT

నల్గొండ జిల్లాలో లో ఘోర ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంతో లారీ డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్, మద్దతుగా మరో ట్రావెల్స్ బస్ డ్రైవర్‌ కూడా వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండటగానే మరో లారీ వేగంగా దూసుకు వచ్చింది.

వాదులాట జరుగుతుండగా...
లారీ డ్రైవర్‌తో ప్రమాదం గురించి చర్చిస్తుండగా డ్రైవర్, క్లీనర్లపై మరో లారీ దూసుకెళ్లింది. దీంతోప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్‌కు మద్దతుగా వచ్చిన డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఈ ఘటనను తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News