Waltair Veerayya Review : మెగా - మాస్ కాంబో.. వాల్తేరు వీరయ్య రివ్యూ

రవితేజ పోలీస్ గా నటిస్తే.. ఎంత హంగామా ఉంటుందో.. అదంతా ఇక్కడ కూడా చూపించారు. కానీ.. విక్రమ్ - వీరయ్య ల..

Update: 2023-01-13 06:03 GMT

waltair veerayya review

సినిమా : వాల్తేరు వీరయ్య

నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, కేథరిన్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలకశంకర్, ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ. విల్సన్
ఎడిటింగ్ : నిరంజన్ దేవరమన్నె
నిర్మాత : నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్)
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, కె. చక్రవర్తి
కథ, దర్శకత్వం :
కె ఎస్ రవీంద్ర (బాబీ)
కథ
సముద్రం పై పట్టున్న వాడు వాల్తేరు వీరయ్య (చిరంజీవి). అవసరమైనప్పుడల్లా నేవీ అధికారులకు తనవంతు సాయం చేస్తుంటాడు. వైజాగ్ పోర్ట్ లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదనే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాను నడిపే సాల్మన్ సీజర్ (బాబీ సింహా) వల్ల పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్రప్రసాద్) విధుల నుండి సస్పెండ్ అవుతాడు. సాల్మన్ ను ఎలాగైనా మలేషియా నుండి తీసుకురావాలని సీతాపతి ప్రయత్నిస్తాడు. అది వీరయ్య వల్ల సాధ్యమవుతుందని తెలుసుకుంటాడు. సాల్మన్ ను రప్పించేందుకు ఇద్దరూ ఓ ఒప్పందం చేసుకుంటారు.
మలేషియా వెళ్లిన వీరయ్య.. అక్కడ సాల్మన్ సీజర్ తో పాటు అతని అన్న కాలా అలియాస్ మైఖేల్ సీజర్ (ప్రకాష్ రాజ్)కూ ఎరవేస్తాడు. మైఖేల్ కీ - వీరయ్యకి మధ్య సంబంధం ఏంటి ? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) వీరయ్యను ఎందుకు శిక్షించాడు ? విక్రమ్ సాగర్ గతమేంటి ? ఈ క్రమంలో విక్రమ్ - వీరయ్య, మైఖేల్ - వీరయ్య లకు మధ్య పోరు ఎలా జరిగిందో తెలియాలంటే.. తెరపై సినిమా చూడాల్సిందే.
వీరయ్య మెప్పించాడా ?
చిరంజీవి - రవితేజ కాంబినేషన్ లో.. భారీ అంచనాల నడుమ విడుదలైంది వాల్తేరు వీరయ్య. టైటిల్ తోనే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. అగ్రహీరోలతో సినిమాలు చేయాలంటే.. కథను జాగ్రత్తగా రాసుకోవాలి. ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఉండేలా.. మార్పులు చేర్పులు చేస్తుండాలి. అలా ఓ అభిమానిగా.. డైరెక్టర్ బాబీ చిరంజీవి కోసం రాసుకున్న కథే.. వాల్తేరు వీరయ్య. ఆడియన్స్ కి మళ్లీ వింటేజ్ చిరుని చూపించాడు. ఊరమాస్ అవతారంలో.. చిరు మార్క్ కామెడీ, యాక్షన్ అంశాలతో చిరంజీవి సినిమా చూసి చాలా కాలమైంది. వాల్తేరు వీరయ్యతో..మళ్లీ ఆ చిరుని చూపించాలని చాలా తపన పడ్డాడు బాబీ. దాదాపు అభిమానుల అంచనాలను రీచ్ అయ్యాడు. మలేషియా వెళ్లాక..చిరు - వెన్నెల కిశోర్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలు.
సెకండాఫ్ లో రవితేజ ఎంట్రీతో.. మెగా-మాస్ అభిమానులకి గూస్ బంప్స్ వస్తాయి. విక్రమ్ - వీరయ్యల మధ్య వైర్యం పై తీసిన సీన్స్ ఆసక్తిగా ఉంటాయి. రవితేజ్ పోలీస్ గా నటిస్తే.. ఎంత హంగామా ఉంటుందో.. అదంతా ఇక్కడ కూడా చూపించారు. కానీ.. విక్రమ్ - వీరయ్య ల మధ్య ఇంకా మంచి భావోద్వేగాన్ని తీసి ఉండొచ్చన్న భావన కలుగుతుంది. రవితేజ, చిరంజీవి.. తమ పాత సినిమాల్లో ఒకరి డైలాగ్స్ మరొకరు చెప్పడం, పూనకాలు లోడింగ్ లో ఇద్దరి డ్యాన్స్.. అలరిస్తాయి. జంబలకిడి జారు మిఠాయ పాటని, చేసే మూడు ఉత్సాహం వంటి మాటలు.. నవ్విస్తాయి. నటన పరంగా.. ఇద్దరూ తమ బెస్ట్ ఇచ్చినా.. కథ, కథనం పరంగా ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బావుండేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+ చిరంజీవి వింటేజ్ లుక్, నటన
+ సెకండాఫ్
+ పాటలు, యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
-కథ, కథనం
-భావోద్వేగాలు
చివరిగా.. వింటేజ్ చిరు కోసం "వాల్తేరు వీరయ్య"ను చూడొచ్చు.














Tags:    

Similar News