పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ

ఈ ఫ్రైడే మూవీ లవర్స్ కు మంచి కమర్షియల్ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక సినిమా పేరులో కూడా కమర్షియల్ ఉన్న గోపీచంద్ సినిమా 'పక్కా కమర్షియల్' రిలీజ్ అయింది.

Update: 2022-07-01 09:15 GMT

టైటిల్: పక్కా కమర్షియల్

తారాగణం: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మి, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సియా గౌతం తదితరులు
కెమెరా: కర్మ్ చావ్లా
ఎడిటర్: ఉద్ధవ్
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 1 జూలై 2022

ఈ ఫ్రైడే మూవీ లవర్స్ కు మంచి కమర్షియల్ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక సినిమా పేరులో కూడా కమర్షియల్ ఉన్న గోపీచంద్ సినిమా 'పక్కా కమర్షియల్' రిలీజ్ అయింది. గోపీచంద్, రాశి ఖన్నా కాంబినేషన్ లో మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినిమా హాళ్లలో విడుదలైంది. మొదటి రోజు, మొదటి ఆటను చూసేందుకు సినీ ప్రియులు బాగానే ఎగబడ్డారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు.

కథ

ఓ అమ్మాయికి న్యాయం చేయలేకపోయానని న్యాయమూర్తిగా తన వృత్తిని వదిలేస్తాడు సూర్య నారాయణ (సత్య రాజ్). న్యాయం చేయలేకపోయానే అని వృత్తిని వదిలేసిన తండ్రికి.. ఏ మెంటాలిటీ ఉన్న కొడుకు పుట్టకూడదో అలాంటి కుమారుడే లక్కీ (గోపీచంద్). ఏది చేసినా కమర్షియల్ గా ఉండాలి.. లాభపడాలి అని అనుకుంటూ ఉంటాడు. అలా చేసి.. చేసి ఓ పెద్ద పారిశ్రామిక వేత్తకు వాదించే లాయర్ అవుతాడు. అలా వివేక్ (రావు రమేష్)కేసులో ఎదురు నిలబడడానికి ఈసారి లక్కీ తండ్రే తిరిగి న్యాయస్థానానికి వస్తాడు. తండ్రీ కొడుకులు ఒక కేసు విషయంలో కోర్టులోనూ.. కోర్టు బయట చేసే పోరాటమే మిగతా కథ.

ఎవరెలా చేశారు:

ఈ చిత్రంలో గోపీచంద్ మరోసారి మెప్పించాడు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా అందరినీ నవ్విస్తుంది.(కొందరికి నచ్చకపోవచ్చు) తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఆ భ్రమలోనే బతికే పాత్రలో సీరియల్ స్టార్ గా రాశీ ఖన్నా మెప్పించింది. రావు రమేష్, సత్యరాజ్, అజయ్ ఘోష్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి పర్వాలేదనిపించారు.

సినిమా గురించి:

సినిమా మొత్తం చూస్తే సిల్లీ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కొన్ని నవ్వు తెప్పిస్తాయి.. ఇంకొన్ని అసలు ఎందుకా అని అనిపిస్తుంది. మునుపటి మారుతి సినిమాల్లోని మ్యాజిక్ కామెడీ సీన్స్ లో కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో హీరో కమర్షియాలిటీ, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఓ రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు, ఓ రెండు పాటలు అన్నట్టుగా సాగింది. ద్వితీయార్థం కూడా అదే ఫార్మాట్. క్లైమాక్స్ లో కొంచెం పర్వాలేదనిపించే ట్విస్ట్ అంతే..! ఆహా.. సూపర్ అని సాగకుండా.. ఏదో చూసేస్తున్నాం అనే భ్రమ కనిపిస్తుంది. పాటలు, వాటికి తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్, కెమెరాపనితనం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైట్స్ ప్లస్ గా చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:

గోపీ చంద్,
రాశీఖన్నా,
అక్కడక్కడ కామెడీ సీన్స్,
ఎలివేషన్స్

మైనస్ పాయింట్స్:

కథ,
రొటీన్ గా అనిపించే సెకండాఫ్
సాంగ్స్

ఫైనల్ గా.. మళ్లీ మనమీదకు ఇంకో కమర్షియల్ మూవీ

రేటింగ్: 2.5/5


Tags:    

Similar News