ఆ వీడియోను తొలగించిన యూట్యూబ్

ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణ్‌వీర్

Update: 2025-02-11 10:10 GMT

ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ ఇలహాబాదియాకు చెందిన వివాదాస్పద వీడియోను యూట్యూబ్ తొలగించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి యూట్యూబ్‌కు నోటీసులు రావడంతో అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోను యూట్యూబ్ తొలగించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

తన వ్యాఖ్యలపై రణ్ వీర్ క్షమాపణలు కోరాడు. ఆ షోలో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి.. నేను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదు. అన్ని వయస్సుల వారు నా పాడ్ కాస్ట్‌ను చూస్తారు.. అలాంటప్పుడు బాధ్యతగా ఉండాలి.. కానీ నేను ఆ వ్యాఖ్యలు చేసి చాలా తప్పు చేశానని రణ్ వీర్ తెలిపాడు. తన అనుచిత వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా వీడియో మేకర్స్‌ను కోరానని, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానని, క్షమిస్తారని ఆశిస్తున్నానని వీడియో విడుదల చేశాడు రణ్ వీర్.


Tags:    

Similar News