అభిమాని పెళ్లికి వెళ్లిన సూర్య
తమిళ నటుడు సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
బిహార్‌లోని బుద్ధ గయా సమీపం లోని ఖాన్‌జహాన్‌పుర్ గ్రామం లోని రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. అందుకు కారణం వారు పండిస్తున్న పంటనే!! ‘బ్రకోలీ గ్రామం’గా ప్రసిద్ధి చెందిన ఈ ఊరిలో ఏటా దాదాపు 5 కోట్ల దిగుబడిని సాధిస్తున్నారు. పంట సాగులో రూపాయికి 20 రూపాయలు లాభం వస్తుండటంతో గ్రామ రైతులకు మంచి ఆదాయం వస్తోంది. బుద్ధ గయాకు వచ్చే విదేశీయుల కారణంగా బ్రకోలీకి ఎక్కువ డిమాండు ఉంటోంది. 40 నుంచి 60 రోజుల్లో దిగుబడి వచ్చే ఈ పంటకు చల్లటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే బ్రకోలీ జీర్ణశక్తికి మంచిదని, సి విటమిన్‌తో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బరువు నియంత్రణకు, కంటిచూపు మెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.