ఈశాన్య భారతంలో భూకంపం
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్‌లో భూ ప్రకంపనల తీవ్రత 5.1గా నమోదు అయింది. త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మోరిగావ్‌కు 50 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.