సౌదీ అరేబియాలో ఎందుకీ మార్పులు
సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఊహించని వాతావరణ మార్పులు అక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఉత్తర, మధ్య ప్రాంతంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వత శ్రేణుల్లో 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనాపై మంచుతో పాటు వర్షం పడింది. ఈ పరిస్థితులపై సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. మేఘాలతో చల్లనిగాలులు సంఘర్షణ చెందడం వల్ల ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని, వరదలు సంభవించే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని హెచ్చరించింది. ఇక విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు చెప్పాలని రియాద్‌లోని పాఠశాల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఈ పరిణామాలకు పర్యావరణ మార్పులే కారణమని అంటున్నారు.