410 రూపాయల ఆవిష్కరణ పాములు, తేళ్లను పారదోలే కర్ర

పొలాల్లో రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల సమస్యలు ఉంటాయి.

Update: 2025-12-26 15:40 GMT

పొలాల్లో రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల సమస్యలు ఉంటాయి. అయితే ఇలాంటి వాటిని తరిమేసే ప్రత్యేక కర్రను గుజరాత్‌లోని సర్‌ భావ్‌సింహ్‌జీ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి క్రిష్‌ దోడియా సృష్టించాడు. ఈ ఆవిష్కరణకు అతడి మిత్రుడి తోడ్పాటు కూడా ఉంది. ఈ కర్రను నేలకు తాకిస్తే ప్రకంపనలు వచ్చి పాములు, తేళ్లను పారదోలతాయి. ఈ కర్ర తయారీకి అయిన ఖర్చు కేవలం 410 రూపాయలే. దీనికి ఎల్‌ఈడీ బల్బును కూడా అమర్చవచ్చు. పొరపాటున ఏవైనా కాటువేసినా పక్కవారిని హెచ్చరించడానికి బజర్‌నూ ఏర్పాటు చేసుకోవచ్చని ఈ కర్ర సృష్టికర్తలు చెబుతున్నారు. వీరి ఆవిష్కరణకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.

Tags:    

Similar News