పాటలతో.. పులులు పరుగో పరుగు
సంగీతంతో ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు.
సంగీతంతో ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. సినిమా పాటలు పెడుతూ ఉంటే పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయని తెలిపారు. మాలా అటవీ రేంజ్‌లో పిలిభిత్ టైగర్ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని పలు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని తెలుసుకుని సౌర శక్తితో పనిచేసే మైక్ సెట్‌ను ఓ వ్యక్తి చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశారు. పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు అక్కడికి అసలు రావడం లేదు. దీంతో మిగతా రైతులు, గ్రామస్థులు కూడా అదే ప్లాన్ వేసి పులులను భయపెడుతూ ఉన్నారు.