అలాంటి ఏఐ కంటెంట్‌ని ప్రోత్సహించొద్దు

సాంకేతికతను దుర్వినియోగం చేయొద్దంటూ సోషల్‌ మీడియా వినియోగదారుల్ని కోరారు నటి శ్రీలీల.

Update: 2025-12-18 09:20 GMT

సాంకేతికతను దుర్వినియోగం చేయొద్దంటూ సోషల్‌ మీడియా వినియోగదారుల్ని కోరారు నటి శ్రీలీల. తనతో పాటు తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవడం చూసి ఆవేదన కలిగిందని తెలిపారు. సోషల్‌ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ను ప్రోత్సహంచవద్దని అభ్యర్థించారు. ఏఐ సహాయంతో సృష్టించే అర్థంలేని వాటికి మద్దతు ఇవ్వొద్దన్నారు. టెక్నాలజీని మంచి కోసం వాడటం వేరు, అసభ్యత కోసం వాడటం వేరని శ్రీలీల తెలిపారు. చాలా విషయాలను పెద్దగా పట్టించుకోనని, నా ప్రపంచంలో నేను జీవిస్తాను.. కానీ, ఈ విషయం నన్ను బాధించిందన్నారు శ్రీలీల. ప్రేక్షకులపై నాకు గౌరవం, నమ్మకం ఉన్నాయి. అందుకే అండగా నిలబడమని అభ్యర్థిస్తున్నా, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని శ్రీలీల పోస్ట్‌లో చెప్పారు.

Tags:    

Similar News