2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!!

2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ డిజైర్ నిలిచింది.

Update: 2025-12-26 15:50 GMT

2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ డిజైర్ నిలిచింది. జనవరి-నవంబర్ మధ్య అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. 2025లో ఇప్పటివరకు లక్షా 95 వేల 416 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. దీని తర్వాత లక్షా 87 వేల 968 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా రెండో స్థానంలో, లక్షా 81 వేల 186 యూనిట్లతో టాటా నెక్సాన్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎస్‌యూవీల వాటానే 55 శాతంగా ఉంది. అయినా టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్ మారుతీ డిజైర్. ఈ టాప్-10 జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన 6 మోడళ్లు ఉండగా, టాటా మోటార్స్ నుంచి రెండు, మహీంద్రా, హ్యుందాయ్ నుంచి చెరొకటి ఉన్నాయి.

Tags:    

Similar News