బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Update: 2025-12-15 10:35 GMT

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపిందని, బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Similar News