జ్ఞాన దంతాలు తీయించుకున్నారట
వ్యోమగాములుగా మారడం అంటే అంత సులువేమీ కాదు. ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వ్యోమగాములుగా మారడం అంటే అంత సులువేమీ కాదు. ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దంతఆరోగ్యం కూడా చాలా కీలకం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన తొలి భారతీయుడు, ఐఏఎఫ్ టెస్ట్ పైలట్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్ర కోసం శిక్షణ తీసుకున్నప్పుడు రెండు జ్ఞాన దంతాలను తొలగించుకున్నట్లు తెలిపారు. వ్యోమనౌ కలో ఉన్నప్పుడు ఏవైనా అనారోగ్య, అత్యవసర సమస్యలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేలా వ్యోమగాములకు ముందుగానే శిక్షణ ఇస్తారని, అయితే వ్యోమనౌకలో దంత సమస్యలకు శస్త్ర చికిత్సలు చేయడం కుదరదన్నారు. అంతరిక్ష యాత్రలో వ్యోమగాములకు ఎలాంటి దంత సమస్యలు రాకుండా ముందే వారిని పరీక్షించి సిద్ధం చేస్తారు. అందుకే రెండు జ్ఞాన దంతాలు తీయించుకున్నానని శుక్లా స్పష్టం చేశారు.