మీ మొబైల్ గ్యాలరీ నుండే లీక్ కు అవకాశం
మొబైల్ ఫోన్ గ్యాలరీల్లో ఆధార్, పాన్ కార్డుల ఫొటోలను ఉంచుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు.
మొబైల్ ఫోన్ గ్యాలరీల్లో ఆధార్, పాన్ కార్డుల ఫొటోలను ఉంచుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ముఖ్యమైన ఫొటోలు, సమాచారాన్ని డిజీలాకర్లలో భద్రపరుచుకోవాలని చెప్పారు. కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు మొబైల్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయని, అందువల్ల గ్యాలరీల్లో ఆధార్, పాన్ కార్డు ఫొటోలు ఉంచుకోవడం సురక్షితం కాదని తెలిపారు. పాస్‌వర్డ్‌లు బలంగా ఉండాలని, పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో ఎలా నడుచుకోవాలనే డిజిటల్ హైజీన్‌ను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని రక్షిత్ టాండన్ చెప్పారు.