మానవ వంతెనగా మారిన యువకులు.. హ్యాట్సాఫ్
పంజాబ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు మోగా జిల్లాలో ఓ రహదారి కొట్టుకుపోయింది.
పంజాబ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు మోగా జిల్లాలో ఓ రహదారి కొట్టుకుపోయింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుకు అటు వైపు చిక్కుకుపోయిన 35 మంది విద్యార్థులను రోడ్డు దాటించేందుకు ఇద్దరు స్థానిక యువకులు వరదకు అడ్డుగా పడుకొని మానవ వంతెనగా మారారు. వారిద్దరి వీపుల మీదుగా విద్యార్థులతో పాటు మరో 10 మంది వ్యక్తులు సురక్షితంగా అవతలి వైపునకు చేరుకున్నారు.
భారీ వర్షాల కారణంగా మల్లెయాన్ గ్రామంలో వరదలు సంభవించాయి. మల్లెయాన్, రసూల్పూర్ గ్రామాలను కలిపే ప్రధాన రహదారిలో ఒక భాగం కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వరదల్లో 35 మంది విద్యార్థులు చిక్కుకుని పోయారు. దీంతో సుఖ్‌బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ ఇద్దరు కూడా మానవ వంతెనలుగా మారారు.