60 కోట్లు గెలుచుకున్నావ్ ఫోన్ తీయవయ్యా!!
లాటరీలో 60 కోట్లు గెలుచుకున్న భారతీయుడికి ఆ విషయం చెప్పాలని నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
లాటరీలో 60 కోట్లు గెలుచుకున్న భారతీయుడికి ఆ విషయం చెప్పాలని నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. బిగ్ టికెట్ అబుధాబి 280 సిరీస్‌లో ప్రవాస భారతీయుడైన శరవణన్ వెంకటాచలం 25 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నారు. వెంకటాచలం గత అక్టోబర్ 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా డ్రా తీయగా అందులో వెంకటాచలం కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. షో నిర్వాహకులు రిచార్డ్, బౌచ్రా శరవణన్‌ను ఫోన్‌లో సంప్రదించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈమెయిల్‌లో ఆయనను సంప్రదిస్తామని నిర్వాహకులు చెప్పారు.