నిన్న ఐష్ నేడు అభిషేక్
నటి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు.
Aishwarya Rai court petition
నటి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. భార్య పిటిషన్ వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్‌సైట్‌లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆ వెబ్‌సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు