Winter Solstice: నేడే శీతాకాలపు అయనాంతం.. అంటే ఏమిటో తెలుసా?
నేడు భారతదేశంలో సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ పగటిపూట
winter solstice brings longest night of the year
నేడు భారతదేశంలో సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ పగటిపూట ఉండనుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబరు 22న ఈ కాల పరివర్తన జరుగుతుంది. ఈ దృగ్విషయాన్నే ‘శీతాకాలపు అయనాంతం’ అని పిలుస్తారు. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగినప్పుడు ‘శీతాకాలపు అయనాంతం’ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి తన అక్షం మీద 23.4 డిగ్రీలు వంగుతుంది. ఈ కారణంగా భూమి ధ్రువం పగటిపూట సూర్యుడికి దూరంగా ఉంటుంది. అందుకే అతి తక్కువ పగలు ఉండనుంది. దీంతో సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగానే డిసెంబర్ 22 శుక్రవారం భారత కాలమానం ప్రకారం ఉదయం 8.57 గంటలకు శీతాకాలపు అయనాంతం సంభవించింది. ఫలితంగా ఉత్తరార్థ గోళంలో అతి తక్కువ పగటిపూట సంభవిస్తుంది. 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు ఉంటుంది.