భార్య నోరా ఫతేహిలా మారాలంటూ!!
రోజూ గంటల తరబడి వ్యాయామం చేసి సన్నబడాలని తన భర్త హింసిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రోజూ గంటల తరబడి వ్యాయామం చేసి సన్నబడాలని తన భర్త హింసిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన మహిళకు ఆరునెలల క్రితం జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లికి 76 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, అదనంగా వరకట్నం కావాలంటూ కూడా తన భర్త వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. లావుగా ఉన్నావంటూ భర్త తనను అవమానిస్తున్నాడని, రోజూ 3 గంటలు వ్యాయామం చేసి బాలీవుడ్ నటి నోరా ఫతేహిలా నాజూగ్గా మారాలని బలవంత పెడుతున్నాడని తెలిపింది.