విమానం గాల్లో ఉండగా.. ఊడిన కిటికీ ఫ్రేమ్

పుణె నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్‌ ఊడిపోయింది.

Update: 2025-07-03 13:15 GMT

పుణె నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్‌ ఊడిపోయింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ధృవీకరించింది. ప్రయాణికుల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపలేదని, విమానం పుణెలో దిగిన తర్వాత ఫ్రేమ్‌ను బిగించినట్లు వెల్లడించింది. క్యూ400 విమానంలోని ఒక కాస్మెటిక్‌ కిటికీ ఫ్రేమ్‌ వదులై ఊడినట్లు గుర్తించామని, అప్పుడు విమానంలో పీడనం సాధారణంగానే ఉందని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ ఫ్రేమ్‌ కిటికీ వద్ద నీడ కోసం అమర్చారని, ప్రత్యేక నిర్మాణం కాదని వివరించింది. ప్రయాణికుల భద్రత విషయంలో తాము ఎలాంటి రాజీ పడబోమని స్పైస్‌జెట్‌ ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News