సినిమా చూసేసి వెళ్ళండంతే.. పేపర్లు వేశారో?

లండన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా చూసేందుకు వచ్చిన తెలుగు ప్రేక్షకులు స్క్రీన్‌పై పేపర్లు చల్లడం ప్రారంభించడంతో థియేటర్ సిబ్బంది షోను అర్ధంతరంగా నిలిపివేశారు.

Update: 2025-07-29 10:30 GMT

లండన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా చూసేందుకు వచ్చిన తెలుగు ప్రేక్షకులు స్క్రీన్‌పై పేపర్లు చల్లడం ప్రారంభించడంతో థియేటర్ సిబ్బంది షోను అర్ధంతరంగా నిలిపివేశారు. ఇలాంటి పనులు చేయాలంటే ముందే అనుమతి తీసుకోవాలని సిబ్బంది వారిని హెచ్చరించారు. పేపర్లు చల్లిన వారిని హాల్ నుంచి బయటకు పంపించారు. విదేశాల్లోని థియేటర్లలో పేపర్స్ చల్లాలన్నా, ఇతర వేడుకలు చేసుకోవాలన్నా ముందుగా థియేటర్ యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మన దేశంలో చేసినట్లుగా బయట దేశాల్లో రచ్చ చేయడం కుదరదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News