ఆకాశంలో ఇంజన్లో మంటలు రాగానే

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది.

Update: 2025-06-26 10:30 GMT

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన పైలట్‌ వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకుని వచ్చి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఆ విమానంలో మొత్తం 159 మంది ఉన్నారు. పైలట్‌ చాకచక్యంతో వ్యహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ అవ్వలేదు.

లాస్‌వెగాస్‌ హ్యారీ రెయిడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం టేకాఫ్‌ అయ్యింది. 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో నార్త్‌ కరోలీనా షార్లెట్‌లోని డగ్లస్‌ ఎయిర్‌పోర్టుకు విమానం చేరుకోవాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ అయ్యాక గాల్లో ఉండగా ఇంజిన్‌ కింది భాగం నుంచి మంటలు, పొగ కనిపించాయి. గమనించిన పైలట్‌ విమానాన్ని తిరిగి లాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News