బర్త్ సర్టిఫికెట్ అడిగితే.. ఏకంగా డెత్ సర్టిఫికెట్
బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.
బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ ఘటన కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి విద్య అనే బాలిక తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్ కోసం పుట్టిన ఆరు నెలల తరువాత దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీలో రికార్డులు లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. దీంతో బర్త్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఆగస్టు 4 వ తేది బర్త్ సర్టిఫికెట్ కోసం కార్యాలయానికి వెళ్లగా బర్త్ సర్టిఫికెట్ తహసీల్దార్ కార్యాలయం ముద్ర వేసి ఇచ్చారు. బాలిక తల్లి మమత సర్టిఫికెట్ ను ఫొటో తీసుకుంది. అయితే నిశితంగా పరిశీలించగా బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఉంది. బాలిక తల్లి అధికారిని ప్రశ్నించగా లాక్కొని చించేశారు. మళ్లీ బర్త్ సర్టిఫికెట్ అందించాడు. అందులో ఎక్కడ కూడా డెలివరీ వివరాలు నమోదు చేయలేదు.