భాగ్యనగరంలో దున్నరాజాలు ఏమి తింటాయంటే?
దీపావళి పండుగ తర్వాత ‘సదర్’ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది
దీపావళి పండుగ తర్వాత ‘సదర్’ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. దీపావళి నుండి రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాలను చూడడానికి వేలాది మంది నగరానికి వస్తుంటారు. ‘సదర్’ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. హరియాణాలోని రోహ్‌తక్, హిస్సార్ ప్రాంతాల నుంచి భారీ దున్నరాజులను నగరానికి తీసుకువచ్చారు. జాతీయ స్థాయి ప్రదర్శనలో బహుమతులు పొందిన రోలెక్స్, ఘోలు-2, కోహినూర్, బాద్‌షా, బజరంగీ దున్నరాజాలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. ముర్రా జాతికి చెందిన ఇవి సుమారు 12 అడుగుల పొడవు, 2000 కిలోల చొప్పున బరువుంటాయి. పండ్లు, చెరకుగడలు, డ్రైఫ్రూట్స్‌తో పాటు రోజుకు 20 లీటర్ల పాలను వీటికి ఆహారంగా అందిస్తారు.