విలేజ్ కుకింగ్.. 3 కోట్లు దాటింది
‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్’.. పక్కా గ్రామీణ శైలిలో ఉంటాయి ఇందులోని వంటకాలు.
‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్’.. పక్కా గ్రామీణ శైలిలో ఉంటాయి ఇందులోని వంటకాలు. అది కూడా ఒకరిద్దరి కోసం చేయరు. చాలా మంది కోసం వండుతూ ఉంటారు. మనకు తెలిసినవే, తెలియనివి వంటలు ఇందులో చూడొచ్చు. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా చిన్నవీరమంగళం గ్రామానికి చెందిన సుబ్రమణియన్, అయ్యనార్, పెరియతంబి, మురుగేశన్, ముత్తుమాణిక్యం, తమిళ్‌సెల్వన్ 2018లో దీన్ని ప్రారంభించారు. లాక్ డౌన్ సమయంలో విశేష ఆదరణ లభించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ ఛానల్ సభ్యులతో కలిసి వంట చేసిన వీడియో వైరల్‌గా మారి కోటి సబ్‌స్క్రైబర్లను పొందింది. ఇప్పుడు ఏకంగా 3 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫుడ్ వీడియోలను అప్‌లోడ్ చేసే ఛానళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. వీరికి ఆదాయం కూడా కోట్లలోనే వస్తోంది.