ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు.
ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు.
ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస వదిలారు. పదమూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సరోజాదేవి. తన కెరీర్ లో 200 లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
1938 జనవరి 7న సరోజాదేవి జన్మించారు. సరోజా దేవి 1955లో ‘మహాకవి కాళిదాస’ చిత్రం ద్వారా నటనా రంగ ప్రవేశం చేసింది. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు సరోజాదేవిని వరించాయి. బడిపంతులు, భూకైలాస్, సీతారామ కల్యాణం వంటి క్లాసిక్ సినిమాల్లో ఆమె నటించారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.