వరుణుడా కరుణించు.. వర్షం పడేనా?
వర్షాకాలం వచ్చినా సరైన వర్షాలు పడడం లేదు. రైతులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
వర్షాకాలం వచ్చినా సరైన వర్షాలు పడడం లేదు. రైతులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వర్షాలు కురిపించడానికి మానవ ప్రయత్నంగా వరుణ యాగం నిర్వహించారు. అంతేకాకుండా అర్చకులు నీటిలో కూర్చుని వరుణ జపం నిర్వహించారు. వెయ్యి కలశాలతో పూజల అనంతరం నీటిలో కూర్చుని జపం చేయాలని శైవ ఆగమ పద్ధతి నిర్దేశిస్తుందని అర్చకులు వివరించారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శిర్డీ సాయిబాబా దేవాలయంలో ఈ వరుణ యాగం, వరుణ జపం, వరుణ యజ్ఞం నిర్వహించారు. వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరుణుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఆలయ అధికారులు తెలిపారు.