త్రిష గొప్ప మనసు.. ఆలయానికి రోబో ఏనుగు విరాళం

సినీ నటి త్రిష చెన్నైలోని ఓ ప్రసిద్ధ ఆలయానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా అందించారు.

Update: 2025-06-28 11:15 GMT

సినీ నటి త్రిష చెన్నైలోని ఓ ప్రసిద్ధ ఆలయానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా అందించారు. జంతు సంక్షేమ సంస్థ 'పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా'తో కలిసి ఆమె ఈ మంచి పనిని చేశారు. చెన్నైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి ఈ రోబోటిక్ ఏనుగును త్రిష కానుకగా ఇచ్చారు. గజ అని ఆ ఏనుగుకు పేరు పెట్టారు. గురువారం మంగళవాయిద్యాల మధ్య, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ యాంత్రిక ఏనుగును ఆలయ పూజారులకు అప్పగించారు. ఇకపై ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపుల వంటి కార్యక్రమాలలో ఈ రోబో ఏనుగును వినియోగించనున్నారు.

Tags:    

Similar News