కుక్కను పెంచుకోవాలంటే 10 మంది పర్మిషన్ కావాల్సిందే

కుక్కను పెంచుకుంటే ఇంట్లో కాస్త స్థలం ఉంటే చాలని అనుకోకండి.

Update: 2025-07-05 13:15 GMT

Dog

కుక్కను పెంచుకుంటే ఇంట్లో కాస్త స్థలం ఉంటే చాలని అనుకోకండి. ఎందుకంటే అన్ని చోట్లా ఒకే తరహాలో నియమ నిబంధనలు ఉండవు. ఇంట్లో ఒక కుక్కను పెంచుకోవాలంటే, ఏకంగా 10 మంది ఇరుగు పొరుగు వారి నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలంటూ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఈ నిబంధన కేవలం ఇండిపెండెంట్ ఇళ్ల‌కే పరిమితం కాదట. అపార్ట్‌మెంట్లలో నివసించే వారైతే, ఆ భవన సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్, కార్యదర్శి నుంచి కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కార్పొరేషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రెండు పత్రాలను సమర్పిస్తేనే పెంపుడు కుక్కను ఇంట్లో ఉంచుకునేందుకు వీలుంటుంది. నగరంలో ఓ చిన్నారి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిందని, అటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News