ఆందోళన కలిగిస్తున్న పులుల మరణాలు
భారతదేశంలో పులుల సంఖ్యపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి.
Tiger
భారతదేశంలో పులుల సంఖ్యపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఓ వైపు వాటి సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 91 పులులు మరణించాయి. సగటున నెలకు 15 పులులు చనిపోతున్నాయి. గతేడాది 126 పులుల మరణాల సంభవించగా ఈ ఏడాది చనిపోతున్న పులుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది చనిపోయిన 91 పులులలో పుల్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 26, మధ్యప్రదేశ్లో 24 చనిపోయాయి. తెలంగాణలో ఒక పులి చనిపోయింది. 24 పులులను వేటగాళ్లు చంపినట్లుగా అధికారుల అనుమానిస్తున్నారు. పులుల మరణాలను కట్టడి చేయడానికి అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉన్నా, సత్ఫలితాలను ఇవ్వడం లేదు.