విమానాశ్రయాల భద్రతకు ముప్పు: నిఘా వర్గాలు

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Update: 2025-08-06 11:15 GMT

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్‌పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News