ఇది కదా ఫాదర్స్ డే గిఫ్ట్ అంటే.. 135 ఏళ్లకు తండ్రి అయ్యాడు
తాబేలు దాదాపు 300 ఏళ్లు బతుకుతుందని అంటారు.
tortoise
తాబేలు దాదాపు 300 ఏళ్లు బతుకుతుందని అంటారు. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఉన్న మయామీ జూలో ఓ తాబేలు 135వ బర్త్‌డేను, అలాగే మొదటి ఫాదర్స్‌డేను కూడా జరుపుకొంది. 234 కిలోల బరువున్న గాలాపాగోస్‌కు చెందిన ఈ తాబేలు పేరు గోలియత్. 1890లో జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ జాతి తాబేళ్లు అంతరించిపోతున్న సరీసృపాల్లో ఉన్నాయి.
గోలియత్‌ను 1929లో బ్రోంక్స్ జూకు, ఆ తరువాత 1981లో మయామి జూకు తరలించారు. ఇన్నేళ్ల తరువాత స్వీట్ పీ అనే వందేళ్ల తాబేలు వల్ల గోలియత్‌కు సంతానం కలిగింది. జనవరి 27న స్వీట్ పీ ఎనిమిది గుడ్లు పెట్టగా 128 రోజులు పొదిగిన తరువాత ఒక్కటి మాత్రమే తాబేలు పిల్లగా మారింది. ఇన్నేళ్లలో గోలియత్‌కు ఇదే తొలి సంతానం కావడంతో మొదటి ఫాదర్స్‌డేగా మారింది.