గాల్లో ఎగురుతుంది.. నీళ్లలో ఈదుతుంది ఈ డ్రోన్

డ్రోన్ అంటే ఎగురుతుందని మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ ఈ డ్రోన్ ఎగరడమే కాకుండా, నీటిలో ఈదుతుంది కూడానూ!!

Update: 2025-07-24 11:30 GMT

డ్రోన్ అంటే ఎగురుతుందని మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ ఈ డ్రోన్ ఎగరడమే కాకుండా, నీటిలో ఈదుతుంది కూడానూ!! డెన్మార్క్‌కు చెందిన విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. గాల్లో ఎగిరేలా.. నీటి లోపల ఈదేలా హైబ్రీడ్‌ డ్రోన్‌ ను అభివృద్ధి చేశారు. డెన్మార్క్‌లోని ఆల్‌బార్గ్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి బృందం ఇటీవల ఈ హైబ్రీడ్‌ డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. వేరియబుల్‌ పిచ్‌ ప్రొపెల్లర్‌ సిస్టమ్‌ తో ఇది పని చేస్తుంది. గాల్లో ఉన్నప్పుడు ప్రొపెల్లర్‌ బ్లేడ్ స్టీపర్‌ పిచ్‌లోకి వెళతాయి, నీటి లోపలికి వెళ్లినప్పుడు ఈ బ్లేడ్లు యాంగిల్‌ను తగ్గించుకుంటాయి. హైబ్రీడ్‌ డ్రోన్లకు మెరైన్‌ సెర్చ్‌, రెస్క్యూ ఆపరేషన్లలో మంచి డిమాండ్ ఉంది.

Tags:    

Similar News