సింహం అని భయపడ్డారు.. తీరా చూస్తే!!
కుక్కలను పెంచడానికి ఎంతో ఇష్టపడే వాళ్లు ఉంటారు.
కుక్కలను పెంచడానికి ఎంతో ఇష్టపడే వాళ్లు ఉంటారు. కొన్ని లక్షలు పెట్టి తెచ్చుకున్న కుక్కలకు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి శునకం ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి కనిపించింది. డుంబ్రిగూడ మండల కేంద్రంలోని చాపరాయిలో సింహం లాంటి ఆకారాన్ని చూసి అందరూ భయపడ్డారు. అయితే అది సింహం కాదని, శునకమని తెలుసుకున్నారు. ఇంకేముంది శునకంతో సెల్ఫీలకు క్యూ కట్టారు. విశాఖపట్నం న్యూకాలనీకి చెందిన వ్యక్తి ఇంగ్లిష్ మాస్టిఫ్ జాతికి చెందిన శునకాన్ని వెంట తీసుకుని, మిత్రులతో చాపరాయికి వచ్చారు. ఈ శునకాన్ని పెంచేందుకు ప్రతి నెల 70-80 వేల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ శునకాన్ని పంజాబ్ నుండి 2 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు.