వీర్యదాత 1700 కోట్లు వారసులకే.. వాళ్లకైనా తెలుసో లేదో?
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ వీర్యదాత.
౧౭౦౦ క్రోర్స్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ వీర్యదాత. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా పిల్లలకు అతడు బయోలాజికల్‌గా తండ్రి. ఇప్పుడు ఆ పిల్లలందరికీ తన సంపదను పంచేస్తారట. 15 ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్లు తెలిపారు. ఇటీవలే తాను వీలునామా రాశానని, తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందన్నారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని తన వీలునామాలో పేర్కొన్నారు. ఈ సంపదను తన బిడ్డలు 30 ఏళ్ల వరకు పొందలేరని, వారు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు పావెల్ .