అమెరికాలో మగ ఈగలతో మహా పోరాటం
అమెరికా దేశాన్ని ఈగలు టెన్షన్ పెడుతున్నాయి. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్స్ పరాన్న జీవులు.
అమెరికా దేశాన్ని ఈగలు టెన్షన్ పెడుతున్నాయి. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్స్ పరాన్న జీవులు. ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుని, వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తున్నాయి.
దీంతో వీటి సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు.