10 రూపాయలకే బిరియానీ పెడుతున్న రైతన్న

ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు పనులపై వచ్చేవారికి ఆ రైతన్న అతి తక్కువ ధరకే కడుపు నింపుతున్నారు.

Update: 2025-07-24 11:00 GMT

ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు పనులపై వచ్చేవారికి ఆ రైతన్న అతి తక్కువ ధరకే కడుపు నింపుతున్నారు. శివాజీ అందిస్తున్న బిర్యానీ, పెరుగన్నం రైతులు, పేదలు తింటున్నారు. 10 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరుతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. అలాంటి వారికి వీరమాచినేని శివాజీ అనే రైతు పది రూపాయలకే వెజ్ బిర్యానీని అందిస్తున్నారు. రైతు శివాజీ 2016 నుంచి 2019 వరకు 5 రూపాయలకే బిర్యానీని అమ్మారు. అయితే కొన్ని కారణాల వల్ల గత ఐదేళ్లుగా బిర్యానీని ఆపేశారు. మళ్లీ బిర్యాని పంపిణీని ప్రారంభించారు. 10 రూపాయలకి 200 గ్రాముల బిర్యానీ ఇస్తున్నారు. 10 కే పెరుగన్నం కూడా పెడుతున్నారు. రోజుకు 75 నుంచి 100 మంది వరకు శివాజీ అందిస్తున్న బిర్యానీ తింటున్నారు.

Tags:    

Similar News